Kothagudem: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన.. ప్రియుడితో భర్తను హత్య చేయించిన ఇల్లాలు

by Shiva |
Kothagudem: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన.. ప్రియుడితో  భర్తను హత్య చేయించిన ఇల్లాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్యే, భర్తను అతి కిరాతకంగా హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గౌతం‌నగర్ కాలనీకి చెందిన ఈశ్వర్ కుమార్, రెహానా భార్యభర్తలు కొన్నాళ్ల నుంచి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెహానాను రమేష్ అనే అతడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తరువాత వారి బంధం వివాహేతర బంధంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న ఈశ్వర్, రమేష్‌ను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని ప్రయత్నించారు.

అయితే, సింగరేణి క్వార్టర్స్‌లో అక్రమంగా ఉంటున్నాడంటూ అతడిపై ఈశ్వర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడి అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇక అప్పటి నుంచి భార్యభర్తల నడుమ నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అయితే, వివాహేతర బంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రెహానా ప్రియుడితో కలిసి ఈశ్వర్‌ను అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త ఈశ్వర్‌పై రమేష్‌, అతని భార్య ఇందిర, మేనల్లుడు చందు ఒక్కసారిగా కత్తులతో తెగబడ్డారు.

హత్య జరుగుతున్న సమయంలో భార్య రెహానా ఇంటి బయట కాపలాగా ఉంది. ఇల్లు ఖాళీ చేయించారనే కక్షతోనే రమేష్ తన భర్తపై దాడికి పాల్పడినట్లుగా కాలనీవాసులను నమ్మించేందుకు రెహానా రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈశ్వర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెహానాపై అనుమానంతో తమదైన స్టైల్‌లో విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి రాగా.. దాడికి పాల్పడిన ముగ్గురితో పాటు రెహాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story