AP News:యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..!

by Jakkula Mamatha |
AP News:యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..!
X

దిశ, కోవూరు:బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇసుక అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అధికారులు నాయకులే అండదండలుగా ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి మూడు ట్రాక్టర్‌లను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. మట్టి, ఇసుక, గ్రావెల్ ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైనం నెలకొంది. మొన్న ముదువర్తి ఇసుకరిచ్‌లో అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా జరుగుతుంటే తాజాగా నేడు మినగల్లు గ్రామంలోని ఇసుక రీచ్‌లో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే పోలీసులు వాటిని గుర్తించి నిన్న రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి వాటిని స్టేషన్‌కు తరలించారు.

ఓ పక్క ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నా నియోజకవర్గంలో అవినీతి జరిగితే సహించేది లేదంటూ చెబుతున్న అక్రమార్కులు మాత్రం మేము తగ్గేది లేదు అవినీతి చేస్తామన్నట్లుగా చెలరేగిపోతున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాటలను ధిక్కరిస్తూ పూర్తి భిన్నంగా నడుచుకుంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక దృష్టి సారించకపోతే నియోజకవర్గం అవినీతి మయం చేస్తారు. అని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్థానికుల ప్రజలు అంటున్నారు. అయితే ఇసుక రీచ్ లో ఉంటున్న సెబ్ అధికారులు వీటిని గమనించకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అధికారులు మాత్రం అక్రమార్జనులకు పాల్పడుతున్నారా అనే అనుమానాలకు తావిస్తున్నాయి. ఇకనైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed