- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CP Avinash Mahanty : మాదాపూర్ లో రూ.7 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..
దిశ, శేరిలింగంపల్లి : మాదకద్రవ్యాల సరఫరా, వినియోగానికి సంబంధించి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని అరికట్టలేక పోతున్నారు. రోజుకో చోట డ్రగ్స్ సప్లై దారులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్యాకెట్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న రూ. 7 కోట్ల విలువైన స్వచ్ఛమైన హెరాయిన్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు మీడియా సమావేశంలో సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు శనివారం ఉదయం శిల్పారామం వద్ద స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నలుగురు హెరాయిన్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారే.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన సంతోష్ ఆచారి అక్కడ ఓ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉన్నాడు. అయితే అతను జైలుకు వెల్లే సమయంలో తన వద్ద ఉన్న హెరాయిన్ డ్రగ్స్ ను నేమి చంద్ భాటి అనే వ్యక్తికి ఇచ్చాడు.
అతను ఈ డ్రగ్స్ ను అమ్మాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఎవరికి అనుమానం రాకుండా కిలో హెరాయిన్ ను పావుకిలో చొప్పున ప్యాక్ చేసి రాజస్థాన్ నుండి స్వీట్స్ డబ్బాల్లో ప్యాక్ చేసుకుని రెండు నెలల క్రితం హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఉంటున్న తన సోదరుడు అజయ్ భాటి వద్దకు వచ్చాడు. అతనికి తన వద్ద కోట్లాది రూపాయల విలువైన స్వచ్ఛమైన హెరాయిన్ ఉన్నట్లు తెలిపాడు. దీంతో వీళ్లిద్దరూ అన్నదమ్ములు రాజస్థాన్ రాష్ట్రానికే చెందిన నర్పత్ సింగ్, అలాగే చౌటుప్పల్ ఉంటున్న హరీష్ సిర్విని కలిసి తమ వద్ద ఉన్న డ్రగ్ ను హైదరాబాద్ లో విక్రయిద్దం అని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో సహాయంతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. శిల్పారామం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేమిచంద్ భాటి, అజయ్ భాటి, నర్పత్ సీంగ్, హరీష్ సిర్వీని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పావుకిలో చొప్పున నాలుగు ప్యాకెట్లలో అమ్మకానికి రెడీగా రూ.7 కోట్ల విలువైన ప్యూర్ క్వాలిటీ గల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు ఫోన్లను సైతం సీజ్ చేశారు.
నేమిచంద్ భాటికి హెరాయిన్ అందించిన సంతోష్ ఆచారి ప్రస్తుతం జోద్ పూర్ జైలులో ఉన్నాడని, అతనిని పిటీ వారెంట్ పై తీసుకు వచ్చి విచారిస్తామని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిందితులు హైదరాబాదులో ఎవరికి డ్రగ్స్ విక్రయించాలని చూస్తున్నారో కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. హెరాయిన్ ను విదేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సరిహద్దుల ద్వారా డ్రగ్ ఫెడ్లర్లు దిగుమతి చేసుకుంటున్నారని సీపీ అన్నారు. పట్టుబడ్డ నర్పత్ సింగ్ పై గతంలో రాజస్థాన్ లో ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని, పట్టుబడ్డ నిందితుల నేర చరిత్ర పై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్, గంజాయి సరఫరాదారులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీపీ అవినాష్ మహంతి ప్రజలను కోరారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, మాదాపూర్ ఎస్ హెచ్ ఓ కృష్ణమోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.