డబ్బులు అడుగుతున్నాడని హతమార్చారు

by Sridhar Babu |
డబ్బులు అడుగుతున్నాడని హతమార్చారు
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రతిసారీ డబ్బులు అడుగుతున్నాడన్న కోపంతో ఇద్దరు స్నేహితులు కలిసి కర్రలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన్ బస్తీలో ఉన్న ఇంటి నెంబర్ 1-90/3/1 ముందు ఒక గుర్తు తెలియని 35 నుండి 40 ఏళ్ల వ్యక్తిని కర్రతో కొట్టగా అతను అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సమీపంలోని సెంట్రింగ్ కాంట్రాక్టర్ సహదేవ్ నుండి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా మాదాపూర్ లేబర్ అడ్డపై కూలిపని చేసుకునే మంద ఉపేంద్ర అనే వ్యక్తిని గత కొన్ని నెలలుగా విజయ్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడని, దీంతో విజయ్ పై కక్ష కట్టి ఎలాగైనా అంతమొందించాలని ఉపేంద్ర పథకం వేశాడు. అందులో భాగంగా మంద ఉపేంద్ర, అతని స్నేహితుడు లింగం కోటయ్య కలిసి మాదాపూర్ హరిజన బస్తీలో విజయ్ కి డబ్బులిస్తామని పిలిచారు. అతను అక్కడికి రాగానే విజయ్ తలపై, మొహంపై వారు కర్రలతో బలంగా కొట్టి హత్య చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు మంగళవారం కోర్టు లో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. మృతుడి ఎడమచేతిపై ఒక పుట్టుమచ్చ ఉన్నట్లు గుర్తించామని, మృతుడు విజయ్ వివరాలు తెలిసిన వారు మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కృష్ణ మోహన్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed