స్నానానికి వెళ్లి అనంతలోకాలకు..

by Aamani |
స్నానానికి వెళ్లి అనంతలోకాలకు..
X

దిశ,వెల్దుర్తి : స్నేహితులతోస్థానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందిన సంఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకులు డపునవీన్20,నెల్లూరురాము25, మంగళవారంమధ్యాహ్నం సమయంలో తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓక్వారిలోని నీటి గుంతలో స్నానానికి వెళ్లి నీటమునిగి మృతి చెందారు. క్వారీలో నీరు చెరువు ని తలపించేలా ఉంది. మొదటగా రాము మృతదేహం లభ్యం కావడం తో స్థానికులు నవీన్ మృతదేహం కోసం గాలించారు.గజ ఈతగాళ్లు అగ్నిమాపక సిబ్బంది గాలింపు సహాయంతో నవీన్ మృతదేహాన్ని వెలికి తీశారు.

మంగళవారం ఇంటి నుండి వెళ్లిన తమ కుమారులు రాత్రి వరకు ఇంటికి తిరిగి లేకపోవడం తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటంతో వారి జాడ కోసం వెతికాసాగారు. బుధవారం ఉదయం మృతుల తో కలిసి స్నానానికి వెళ్లిన గ్రామానికి చెందిన రాజు విషయాన్ని తెలుపడంతో ఈ సంఘటన బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు చేగుంట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed