- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హర్షసాయి ట్రస్ట్ పేరిట మోసం
దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో హర్ష సాయి ట్రస్ట్ పేరుతో మోసానికి తెర తీశారు. ఓ పబ్లిక్ వాట్సాప్ గ్రూప్ లో చొరబడిన కేటుగాళ్లు గతంలో ఉన్న అడ్మిన్లను రిమూవ్ చేశారు. గ్రూప్ పేరుని కూడా హర్ష సాయి ట్రస్ట్ గా మార్చారు. రూ.2000 చెల్లించిన వారికి రూ.18500 నగదుని తిరిగి చెల్లిస్తామని ఓ ఆఫర్ ప్రకటించారు. ఈ అవకాశం కొంతమందికి మాత్రమే ఉందని కంగారుపెట్టారు. ట్రస్ట్ కు సంబంధించి కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నాయని.. ఓ బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ ఫొటోని షేర్ చేశారు. మరో వ్యక్తి తాను పోలీస్ సీఐనని..
రూ.2 వేలు వేస్తే రూ.18,500 తిరిగి వచ్చాయని కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ పెట్టి నమ్మబలికాడు. ఈ ట్రస్ట్ కి ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించే ప్రముఖ యూట్యూబర్ పేరు పెట్టడంతో.. ఇదంతా నిజమని నమ్మిన కొందరు.. కేటుగాళ్లు పంపిన యూపీఐ స్కానర్ కు నగదు చెల్లించి మోసపోయారు. అశ్వారావుపేటకు చెందిన ఎస్కే రఫీ అనే వ్యక్తి రూ.2 వేలు చెల్లించిన తర్వాత అతని నెంబర్ ను కేటుగాళ్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో మోసపోయానని తెలుసుకొని లబోదిబోమన్నాడు. అపరిచిత వ్యక్తులకు వాట్సాప్ గ్రూపుల ఇన్వైట్ లింక్ షేర్ చేయడం.. అడ్మిన్ ను ఇవ్వడం వల్ల ఇలాంటి అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందని.. వాట్సాప్ గ్రూపులలో ఉండే వ్యక్తులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
- Tags
- Fraud