పండుగపూట తీవ్ర విషాదం.. తండ్రి, కొడుకు మృతి

by GSrikanth |
పండుగపూట తీవ్ర విషాదం.. తండ్రి, కొడుకు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగపూట రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో లారీ-బైక్ ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులు దొన్కల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story