- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘోర రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి... ఎనిమిది మందికి గాయాలు
దిశ, అచ్చంపేట : కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్ర నుండి బొలెరో వాహనంలో శ్రీశైలం మల్లన్న దైవదర్శనం కోసం వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం ఎన్హెచ్ 765 జాతీయ రహదారి చందాపూర్ గేటు సమీపంలో జరిగింది. వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అచ్చంపేట ఎస్సై రాము తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రకు చెందిన ఉప్లి గ్రామం,
వడ్వాని మండలం, బీర్ జిల్లాకు చెందిన వాగ్మారి విక్కీ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో శనివారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో అచ్చంపేట మండల పరిధిలోని చందాపూర్ గ్రామ శివారులో వాహనం నడుపుతున్న డ్రైవర్ అచ్యుత్ విటల్ నిద్రపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. దాంతో పక్కనే ఉన్న చంద్రసాగర్ కాల్వలో వాహనం బోల్తాపడింది.
దాంతో ఇందులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో వాగ్మరి విక్కి, వాగ్మరి రుక్మిణి, విటల్, మారుతీలకు తీవ్ర గాయాలు కాగా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ రుక్మిణి చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ఈ సంఘటనపై ఎస్ఐ ఎం. రాములు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- road accident