విద్యుదాఘాతంతో రైతు మృతి

by Sridhar Babu |
విద్యుదాఘాతంతో రైతు మృతి
X

దిశ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో విద్యుదా ఘాతంతో దాసరి రాజు (26)అనే రైతు మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం పంట పొలానికి నీరు వదిలే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు జుక్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధులకు అప్పగించారు. అందరితో కలుపుగోలుగా ఉండే రైతు దాసరి రాజు మృతి చెందడంతో కౌలాస్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed