- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంప్ ముఠా అరెస్టు
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలో నకిలీ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. విచారణ అనంతరం ఏ టూ జెడ్ కమ్యూనికేషన్ అన్లైన్స్ సెంటర్ నిర్వాకుడు గణేష్ @ అబ్దుల్ , కార్తీక్ రబ్బర్ స్టాంప్,బుక్ బైండింగ్ నిర్వాహకుడు గిరిబాబులను మంగళవారం రాత్రి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే భువనగిరి పట్టణంలోని సమజ్ చౌరస్తాలో ఏ టు జెడ్ కమ్యూనికేషన్ సెంటర్ నిర్వహిస్తున్న అబ్దుల్లా అలియాస్ సుందర్ గణేష్, నకిలీ స్టాంపులు తయారు చేసే పట్టణంలోని హనుమాన్
వాడకు చెందిన మరికుకుల గిరిబాబు, హైదారాబాద్ కు చెందిన నజీర్ అలియాస్ నర్సింగ్ రావు, ఢిల్లీ కి చెందిన భరత్ గుప్తా తో కలిసి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. వీరు పాన్ కార్డులలో పేర్లు మార్చి నకిలీ రబ్బర్ స్టాంపులు, రాజముద్రలు, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, మసీదుల లెటర్ ప్యాడ్స్ తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. వీరి ఇళ్లల్లో తనిఖీలు చేసి పలు పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో ఇద్దరు నిందితులు అయిన నర్సింగ్ రావు @ నజీర్, భరత్ గుప్త పరారీలో ఉన్నారు. ఈ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.