కర్రీ పాయింట్ లో సిలిండర్ పేలుడు

by Sumithra |
కర్రీ పాయింట్ లో సిలిండర్ పేలుడు
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని సూర్యనగర్ లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దుర్గాదేవి కర్రీ పాయింట్ లో రాత్రి షాప్ మూసివేసిన తర్వాత అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దానితో దుకాణం షెటర్ ఊడిపోయి బయటపడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కర్రీ పాయింట్ లో ఉన్న సిలిండర్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story