హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్

by Satheesh |
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌ నగర్‌లో డ్రగ్స్‌ను పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ హైదరాబాద్‌, ఫిలింనగర్‌లో పోలీసులు డ్రగ్స్ అమ్ముతోన్న వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడు ఓ పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ దందాలో కొందరు పరారైనట్లు తెలిసింది. నిందితుడు పబ్‌కు వస్తున్న కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి వద్ద 20 గ్రాముల ఎండీఎంఏ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితుడు బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story