వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Jakkula Mamatha |
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్:వినాయక నిమజ్జనంలో(Vinayaka immersion) తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని అంథేరి ఛా రాజా విగ్రహాన్ని వెర్సోవా బీచ్‌లో నిమజ్జనం చేసేందుకు భక్తులతో వెళ్తున్న పడవ ఊహించని విధంగా నీట మునిగిన సంఘటన ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ క్రమంలో భక్తులు(Devotees) నీటిలో పడటంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈత తెలిసిన కొందరు ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారిని దగర్లోని పడవల్లో ఉన్న వారు సురక్షితంగా బయటకు తీసుకచ్చారు. దీంతో భారీ విషాదం(tragedy) తప్పింది. ఒక భక్తుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story