- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఐదు రోజుల క్రితం అదృశ్యం...శవమై ప్రత్యక్షం
దిశ, మిర్యాలగూడ : ఐదు రోజుల క్రితం ఇంటి నుండి టీ తాగి వస్తానంటూ బయటికి వెళ్లిన యువకుడు అదృశ్యమై శవమై చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో కనిపించాడు. ఈ సంఘటన మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం తాళ్లగడ్డకు చెందిన గొడుగు మహేష్ (23) బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. అవివాహితుడైన మహేష్ ఈనెల 10వ తేదీన ఉదయం టీ తాగి వస్తానంటూ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు తమ కొడుకు అదృశ్యమయ్యాడని ఆదివారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా ఆదివారం అవంతీపురం శివారులో కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు యువకుడి శవం వేలాడుతూ ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లిన రూరల్ పోలీసులు చనిపోయిన వ్యక్తి గొడుగు మహేష్ గా గుర్తించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ కె. వీరబాబు తెలిపారు. కాగా తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.