Overtake effect : ఓవర్​టేక్​ చేయబోయి మృత్యువాత

by Sridhar Babu |
Overtake effect : ఓవర్​టేక్​ చేయబోయి మృత్యువాత
X

దిశ, పరిగి : బిర్యాని తినేందుకు వచ్చి లారీని ఓవర్​ టేక్​ చేయబోయి బైక్​ ను ఢీ కొట్టి అదుపు తప్పి కిందపడగా పక్కనుంచి మరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరిగి ఎస్​ఐ సంతోష్​ తెలిపిన వివరాల ప్రకారం బొంరాస్​ పేట్​ మండల కేంద్రానికి చెందిన నజీబ్​ అలియాస్​ నజ్జు ( 27), శేఖర్​, దుర్గప్ప, అశోక్​, సీతారాం వీళ్లంతా ద్విచక్ర వాహనాలపై పరిగికి బయలుదేరారు. పరిగి మండలం గడిసింగాపూర్​ గ్రామ

Overtake effectశివారులోకి రాగానే హైదరాబాద్​– బీజాపూర్​ జాతీయ రహదారి ( హైవే 163 ) పై లారీని ఓవర్​ టేక్​ చేయబోయిన నజీబ్​, శేఖర్​ లు ముందు వెళ్తున్న వీరి స్నేహితుల ద్విచక్రవాహనంను ఢీ కొన్నారు. దీంతో నజీబ్​ హైవే రోడ్డుపై కుడివైపునకు పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని వాహనం నజీబ్​ పై నుంచి వెళ్లడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. నజీబ్​ అతని స్నేహితులంతా ఓ క్రషర్​ మిషన్​ లో డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఢీ కొట్టి వెళ్లిన వాహనం తవేరా అని అనుమానిస్తున్నారు. ఢీ కొట్టి వెళ్లిన వాహనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్​ఐ సంతోష్ తెలిపారు.

Advertisement

Next Story