- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూతురు ఇంటికి వచ్చి మృత్యువాత
దిశ, మక్తల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని దోబ్బలి బాలప్ప( 60) మృతి చెందిన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన బాలప్ప మక్తల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో ఉన్న కూతురు ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఉదయం మక్తల్ వచ్చి తిరిగి పంచలింగాలకు రాత్రి బస్సు లేకపోవడంతో
బస్టాండ్ నుంచి నడిచి వెళ్లాలని భావించాడు. ఈ క్రమంలో దారితప్పి రాయచూరు రోడ్డుపై వెళ్లుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దాంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కొంతమంది బాటసారులు మక్తల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వారు చేరుకుని మృతదేహాన్ని మక్తల్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.
- Tags
- Died