- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Cyber fraud : జగిత్యాలలో సైబర్ మోసం
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రభుత్వంతో పాటు బ్యాంకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో చోట సైబర్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ర్యాగల శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు. వాట్సాప్ లో వచ్చిన ఓ లింక్ బ్యాంక్ నుండి వచ్చిందే అనుకొని పొరబడి ఓపెన్ చేసి ఏటీఎం డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత అరగంటకి శివ ప్రసాద్ అకౌంట్ నుండి విడతలవారీగా ఐదు సార్లు 5,000 రూపాయల చొప్పున ఒకసారి 15,000 రూపాయలు
చొప్పున కట్ అయినట్లుగా మెసేజ్ లు వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు శివప్రసాద్ మాట్లాడుతూ తన అకౌంట్ కు లింక్ అయిన నెంబర్ కు అచ్చం బ్యాంక్ లోగో తో ఉన్న లింక్ రావడంతో బ్యాంక్ అధికారులే పంపించారని క్లిక్ చేసి మోసపోయినట్లు వాపోయాడు. అపరిచిత వ్యక్తులు పంపించే లింకులతో పాటు ఏపీకే ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేయకూడదని అకౌంట్ నెంబర్ తో సహా ఓటీపీ ఇతర వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోకూడదని పోలీసులు సూచించారు.
- Tags
- Cyber fraud