గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

by Sumithra |
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
X

దిశ, నిజామాబాద్ క్రైం : రోజువారీ విధుల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో రోల్ కాల్ కు అటెండ్ అయిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు కోటి రోల్ కాల్ సమయంలో సహచరుల ముందు కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కానిస్టేబుల్ ని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్ అధికారులు కానిస్టేబుల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story