నీటి సంపులో పడి చిన్నారి మృతి

by Sumithra |
నీటి సంపులో పడి చిన్నారి మృతి
X

దిశ, జడ్చర్ల : అభం శుభం తెలియని రెండున్నర సంవత్సరాల చిన్నారి ఆడుకుంటూ ఇంటిముందర ఉన్న నీటి సంపులో పడి మృతిచెందిన విషాదకర ఘటన ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటకు చెందిన వినోద్ పుష్పలతల దంపతులకు చెందిన రిహాన్సిక (32) నెలల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ముందర ఉన్న నీటి సంపులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఉదయం మున్సిపాలిటీ ద్వారా నల్లా నీరు రావడంతో ఇంట్లో నీటిని పడుతున్న కుటుంబ సభ్యులు సంపులో నీరు వదిలారని సంపు పై మూత కొద్దిగా తెరిచి ఉంచారని తెలిపారు.

ఇదే క్రమంలో కొద్దిసేపటి తర్వాత తమ కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారని ఆయన కనపడకపోవడంతో చిన్నారిని ఎవరో అపరించారని పట్టణంలో వెతకసాగారు. చివరికి మరోసారి అనుమానంతో నీటి సంపులో లోపలికి చూడగా చిన్నారి నీటిసంపులో ఉన్నట్లు గమనించి వెంబడే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. కాగా చిన్నారి నీటి సంపులో పడి మృత్యువాత వాడడంతో చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు కావరమ్మపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Next Story