- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈదురు గాలులకు కోళ్ల ఫారం కూలి ఇద్దరు మృతి
దిశ, ములుగు : ఈదురు గాలులకు కోళ్లఫారం కూలి ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రగాయాలపాలైన ఘటన మండల పరిధిలోని క్షీరసాగర్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ లోని చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40), మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపురం గ్రామానికి చెందిన గౌరీశంకర్(30) తమ కుటుంబ సభ్యులతో కలిసి ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన తమ సమీప బంధువైన విభూతి శ్రీనివాస్ ఇంటికి వేరువేరుగా వెళ్లారు. కాగా ఆదివారం
సాయంత్రం బంధువులతో కలిసి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా వర్షంతో కూడిన ఈదురు గాలులు వీయడంతో రక్షణ కొరకు సమీపంలోని కోళ్ల ఫారంలోకి వెళ్లారు. ఈదురు గాలులు బలంగా వీయడంతో కోళ్ల ఫారం గోడలు కూలి అక్కడే ఉన్న భాగ్యమ్మ, గౌరీశంకర్‌తో పాటు వారి బంధువుల పై పడింది. ఈ ప్రమాదంలో భాగ్యమ్మ, గౌరీశంకర్లు ఘటన స్థలంలోనే మృతిచెందగా వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్రగాయాలపాలయ్యారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్సనిమిత్తం దవాఖానకు తరలించామని, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.