- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Car accident : కారు బీభత్సం...మూడు కార్లు ఢీ
దిశ, కౌడిపల్లి : నర్సాపూర్ వైపు నుంచి మెదక్ కు వెళ్తున్న ఇండికా కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంగా కారు నడపడంతో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొన్న సంఘటన ఆదివారం మండల కేంద్రం కౌడిపల్లి శివారులోని బ్రిడ్జి( పెద్దకానల్) వద్ద జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వెళ్తున్న ఇండికా కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంగా కారు నడిపి ఎదురుగా వస్తున్న గుర్రంను ఢీ కొట్టాడు. గుర్రం వెనకాలే బైక్ పై ఉన్న మల్లేశం కాలు విరిగింది. అంతేకాకుండా మెదక్ వైపు నుంచి
నర్సాపూర్ వెళ్తున్న మారుతి ఆల్టో కారును ఢీకొన్నాడు. వెనకాలే వస్తున్న మారుతి స్విఫ్ట్ కారు ముందు వెళ్తున్న ఆల్టో కారును ఢీకొంది. దీంతో ఆల్టో కారులో ప్రయాణిస్తున్న హసీనా బేగం, అబ్దుల్ ఆసిఫ్,ఇర్ఫాన్, సోయాబ్ మరి కొంతమందికి కాళ్లు చేతులు విరిగాయి. గుర్రంకు కూడా కాళ్లు విరిగాయి. ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది జేసీబీ సహాయంతో ప్రమాదంలో ధ్వంసమైన కార్లను తొలగించి ట్రాఫిక్ జామ్ కాకుండా దగ్గరుండి సహాయక చర్యలు తీసుకున్నారు.
- Tags
- Car accident