- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉరివేసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రోజూ అనేక మంది యువతీ, యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి.. అవి తీర్చలేక దారుణాలకు ఒడిగడుతున్నారు. వీటిపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వినకుండా రోజూ ఎక్కడో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట్‌లో బీటెక్ చదువుతున్న వినీత్ అనే విద్యార్థి ఐపీఎల్‌లో విస్తృతంగా బెట్టింగ్‌లకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెలిసిన మిత్రులు, యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేదేంలేక, ఇంట్లో చెప్పుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఐపీఎల్ వేళ ఎవరు బెట్టింగ్‌లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక యువతను హెచ్చరించారు. ఆత్మహత్యలకు పాల్పడే ముందు కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని హితవు పలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.