Brutal murder: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

by Shiva |
Brutal murder: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: అనుమానంతో భార్యను భర్త అత్యంత కిరాతంగా హతమార్చిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండల పరిధిలోని శెట్టిపేట గ్రామానికి చెందిన కుససాల చిరంజీవి, నవ్య భార్యభర్తలు. అయితే, కొన్నాళ్ల నుంచి చిరంజీవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే, శనివారం రాత్రి వారిద్దరూ మరోసారి వాగ్వాదానికి దిగారు. దీంతో క్షణికావేశానికి గురైన చిరంజీవి, భార్య నవ్యను పదునైన మిషన్ కుట్టే కత్తెరతో గొంతులో పొడిచి హతమార్చాడు. దీంతో నవ్య తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న నవ్య తరఫు బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Next Story