BREAKING: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

by Shiva |
BREAKING: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల మనోహర్‌ను ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇవాళ మనోహర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story