- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: కర్ణాటకలో మరో సంచలనం.. పెళ్లైన 24 గంటల్లోనే రక్తపు మడుగులో నవ దంపతులు
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రేమికుల గాధలు విషాదాంతం అవుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రేమలో ఉండి ఇంట్లో చెప్పలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు ప్రేమించినోడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోక మరికొందరు ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా, కర్ణాటకలో ఆ రెండింటికీ భిన్నంగా ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఓ ప్రాంతానికి చెందిన ఓ ప్రేమ జంట కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే, వారిద్దరూ వివాహంతో ఒక్కటయ్యేందుకు ఇటీవలే ఇరు కుటుంబాలను ఒప్పించారు.
దీంతో బుధవారం ఉదయం అందరి సమక్షంలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. గురువారం ఉదయం బెడ్‌రూం గది తలుపులు తెరిచి చూడగా.. నవ దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ క్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు సమీప ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లుగా ధృవీకరించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రాథమిక విచారణలో భాగంగా ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నట్లుగా బంధువులు పోలీసులకు తెలిపారు. పెళ్లై 24 గంటలకు గడవక ముందే నవ దంపతులు ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.