- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం.. తక్కువ ధరకే బంగారమని రూ.4 కోట్లకు టోకరా
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో కేటుగాళ్లు ఎక్కువైపోయారు. వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇటీవలే పెట్టిన పెట్టుబడికి అధిక వడ్డీ ఇస్తామని అబిడ్స్‌లో ఓ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన మరువకు ముందే తాజాగా నగరంలో మరో ఘరానా మోసం బయటపడింది. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువ ధరకే బంగారం ఇస్తామని కొందరు కేటుగాళ్లు అమాయకులకు నమ్మబలికారు. గోల్డ్ స్కీం పేరుతో దాదాపు రూ.4 కోట్ల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే సిటీ నుంచి జంప్ అయ్యారు. రూ.50 వేలు కట్టి స్కీంలో చేరితే.. బంగారం కొనుగోలులో 10 శాతం డిస్కౌంట్‌తో ఇస్తామని విశాల్, వినయ్, నిఖిల్ అనే వ్యక్తులు చాలామంది నుంచి డబ్బులు సేకరించారు. అలా దాదాపు రూ.4 కోట్లు జమయ్యాక వారంతా డబ్బుతో పరారయ్యారు. ఈ క్రమంలోనే బంగారం గురించి పలువురు వారికి ఫోన్ చేయగా.. ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో డబ్బులిచ్చి వారు తాము మోసపోయినట్లుగా గ్రహించారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.