సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో దారుణం.. పాపకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని

by Shiva |
సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో దారుణం.. పాపకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక చిక్కబళ్లాపూర్‌లోని ఓ హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాపకు జన్మనిచ్చింది. ఈ వ్యవహారంలో హస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో బాలిక ఎనమిదో చదువుతుండగా హాస్టల్లో చేరింది. అయితే, ఆ అమ్మాయికి పదో తరగతి అబ్బాయితో సంబంధం ఉంది. వాళ్లిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పాఠశాల చదువు పూర్తయిన తరువాత బాలుడు తన బదిలీ సర్టిఫికేట్ (టీసీ) పొంది బెంగళూరుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే బాలిక హస్టళ్లో ఉండకపోయేదని, తరుచూ బంధువుల వద్దకు వెళ్లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణప్ప మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి చిన్నారి హాస్టల్‌కు రావడం లేదన్నారు. బాగేపల్లి పట్టణంలోని కాశాపురానికి చెందిన ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ.. ఆసుపత్రికి వెళ్లిందని తెలిపారు. దీంతో ఆమెను వైద్యులు పరీక్షించగా గర్భం దాల్చిందని తెలిసిందని పేర్కొన్నారు. ఈ మేరకు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story