ప్రజాప్రతినిధి తోటలో వృద్ధుడు దారుణ హత్య

by Nagaya |
ప్రజాప్రతినిధి తోటలో వృద్ధుడు దారుణ హత్య
X

దిశ, వేములవాడ : 60 ఏండ్ల వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం వేములవాడ పట్టణ శివారులో జరిగింది. డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. జూలపల్లి మండలానికి చెందిన రాజయ్య(60) వేములవాడ-చెక్కపల్లి రహదారిలోని తోటలో గత కొన్ని రోజులుగా కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఇనుప పారా(రాడ్) తో రాజయ్య తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందినట్లు డీఎస్పీ చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాజయ్య పని చేస్తున్న తోట వేములవాడ రూరల్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందినదిగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed