crime news : యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..

by Sumithra |
crime news : యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..
X

దిశ, గుమ్మడిదల : ప్రేమ వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుమ్మడిదల మండల పరిధిలోని దోమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దోమడుగు గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి తేజస్వి (21) కి అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య కొన్ని రోజుల వరకు మెసేజ్ చాటింగ్ జరిగినట్లు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తేజస్వినిని శ్రీహరి ప్రేమిస్తున్నట్లు తనని వివాహం చేసుకోవాలని తెలుపుతూ యువతని వేధింపులకు గురి చేశాడు.

ఇదే విషయంలో తేజస్విని కుటుంబ సభ్యుల పై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి వేధింపులను భరించలేక గురువారం రాత్రి సమయంలో ఇంటి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు యువతని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఇదే విషయం పై గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ టీమ్ల ద్వారా దర్యాప్తును ప్రారంభించినట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed