దారుణం..ప్రేమించట్లేదని యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

by Disha Web Desk 18 |
దారుణం..ప్రేమించట్లేదని యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
X

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక హుబ్బళ్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతిని కిరాతకంగా చంపేశాడు. వివరాల్లోకి వెళితే..కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహ (24) BVB కాలేజీలో చదువుతోంది. కాలేజీలో సీనియర్ అయిన ఫయాజ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. నేహ అతని ప్రేమని నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతను యువతి మెడపై విచక్షణరహితంగా తొమ్మిది సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి లవ్ జిహాద్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story