- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయం : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయడానికి బీజేపీ పుట్టలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అందించిన రాజ్యాంగపు స్వచ్ఛతను కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. తాను జీవించి ఉన్నంత వరకు, మతం ఆధారంగా రిజర్వేషన్ల ఆట ఆడటానికి అనుమతించనని మోడీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీకి ఈసారి 400 లోక్‌సభ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బిజూ జనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బయటి నుంచి ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నాయి. వాటిని కూడా కలుపుకుంటే.. ఇప్పుడు కూడా మాకు 400 లోక్‌సభ సీట్ల బలం ఉంది. ఈవిషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా ?’’ అని మోడీ ప్రశ్నించారు.
‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, జనరల్ కేటగిరీలోని పేదలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ మార్చలేరు’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నకిలీల ఫ్యాక్టరీగా మారిందని.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోని సమాచారమంతా నకిలీదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ధైర్యముంటే ‘నకిలీ వీడియో’ గేమ్‌లను ఆపేసి.. తనను సూటిగా ఎదుర్కోవాలని ప్రధాని మోడీ సవాల్ విసిరారు. ఏపీ, కర్ణాటకలో ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి.. ముస్లింలకు ఆ కోటాను కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.