- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే 4 ఏళ్లలో రూ. 1.67 లక్షల కోట్ల పెట్టుబడులు: వేదాంతా గ్రూప్
దిశ, బిజినెస్ బ్యూరో: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. రాబోయే నాలుగేళ్లలో గ్రూపునకు చెందిన అన్ని వ్యాపారాల్లో 20 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 1.67 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ఉన్నామని బుధవారం అనిల్ అగ్ర్వాల్ తెలిపారు. పెట్టుబడులు ప్రధానంగా టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, గ్లాస్ వ్యాపారాలపై ఉంటుందని అన్నారు. తన సొంత రాష్ట్రం బీహార్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్టు అనీల్ అగర్వాల్ చెప్పారు. అయితే, దానికోసం పాలసీ పరంగా ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. వేదాంత గ్రూప్ తన దాతృత్వ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ప్రకటన కార్యక్రమంలో అనీల్ అగర్వాల్ పెట్టుబడుల గురించి చెప్పారు. సంస్థ బృందం గ్రామాల్లో పిల్లల పౌష్టికాహార అవసరాలను ఆరు వేల నుంచి 25,000 గ్రామాలకు పెంచనుంది.