Road Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Aamani |
Road Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రోజున రాత్రి 10:45 గంటలకు ఒక బైక్ పై వెళుతున్న యువకుడిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యాదయ్య కుమారుడు రాసుల సాయి, రాయపోల్ ఇబ్రహీంపట్నం లో నివాసముంటున్న కుర్మ విద్యార్థి, రాయపోల్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నాడు.

మార్గమధ్యంలో గంగాదేవి ఆలయం రాయపోల్ వద్దకు చేరుకోగా, అదే మార్గంలో వస్తున్న టీఎస్ 07 ఎఫ్‌వై 4572 నంబర్ గల కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. నిందితుడు దోర్నాల రాజేష్ తండ్రి యాదగిరి, వయస్సు 19 సంవత్సరాలు విద్యార్థి రాయపోల్ గ్రామస్తుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story