మరొకరిని బలితీసుకున్న వాటర్​ హీటర్​

by Sridhar Babu |
మరొకరిని బలితీసుకున్న వాటర్​ హీటర్​
X

దిశ, మేడిపల్లి : వాటర్​ హీటర్​ మరొకరిని బలితీసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో గడ్డం మాలకొండయ్య ( 48) అనే వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన వాడు. ఇతను కట్లకుంట గ్రామంలో గత ఐదు నెలల నుండి తాపీ మేస్త్రి పని చేస్తూ కట్లకుంట గ్రామంలో కిరాయికి ఉంటున్నాడు. మాల కొండయ్య కిరాయికి ఉన్న ఇంట్లో స్నానానికి వేడి నీళ్లు పెట్టుకునే క్రమంలో ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ వల్ల కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు గడ్డం మధు ఫిర్యాదు మేరకు ఎస్సై శ్యామ్ రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story