గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ, పేట్ బషీరాబాద్ : గంజాయిని కొనడం, ఇంకోచోట నుంచి తెచ్చుకోవడం రిస్క్ ఎందుకని అనుకున్నాడు ఏమో ఏకంగా గంజాయి మొక్కలను పెంచి అవసరాలను తీర్చుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ (35) ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి దూలపల్లి లో స్టీల్ కంపెనీలో వాచ్మెన్ గా పనులు చేస్తున్నాడు.

అతనికి ఇచ్చిన క్వార్టర్స్ వద్ద నాలుగు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. విషయాన్ని పసిగట్టిన మేడ్చల్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ అధికారులు సదరు ప్రాంతంలో తనిఖీలు చేసి పెరుగుతున్న మొక్కలు గంజాయి మొక్కలుగా నిర్ధారించుకున్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకొని వికాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బీహార్ నుంచి విత్తనాలను తెచ్చుకొని ఇక్కడ నాటినట్లు, అతను వినియోగించుకుంటానికి ఈ మొక్కలను పెంచుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story