HYD: బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పిస్తామని భారీ మోసం

by GSrikanth |
HYD: బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పిస్తామని భారీ మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో పేరుతో భారీ మోసం జరిగింది. అమాయక యువతిని లక్ష్యంగా చేసుకొని హౌజ్‌లోకి పంపిస్తామని చెప్పి భారీగా డబ్బులు లాగారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో స్వప్న అనే బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌లో అవకాశం కోసం చూస్తోన్న స్వప్న అనే యువతి‌ని చాకచక్యంగా సత్య అనే వ్యక్తి ప్రొడక్షన్‌ ఇన్‌చార్జిని అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే బిగ్‌‌బాస్‌లోకి పంపిస్తానని చెప్పి ఆమె వద్ద దాదాపు రూ.2.5 లక్షలకు పైగా లాగాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సత్య కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story