ఆపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ముప్పు

by Shiva |
ఆపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ముప్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దొంబివాలీ ప్రాంతంలోని ఖోని పలావాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న కుటుంబాలను పొలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు పంపారు. అయితే, ఇటీవలే ఆ భవన నిర్మాణం పూర్తి కావడంతో కేవలం క్రింది మూడు ఫ్లోర్లలో మాత్రమే కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పైన ఉన్న ఫ్లోర్లు అన్నీ ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story