- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్ర గాయాలు
by Sridhar Babu |

X
దిశ, బషీరాబాద్ : సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బషీరాబాద్ మండల పరిధిలోని రెడ్డి ఘనపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
పెద్ద కుర్వ దేవప్ప ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చూపించటంతో ఆ వ్యక్తి లైటర్ వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద కుర్వా దేవప్ప తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Gas leak
Next Story