- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్తీకల్లు తాగి 8 మందికి అస్వస్థత
దిశ ప్రతినిధి, వికారాబాద్ : కల్తీకల్లు తాగి 8 మంది అస్వస్థతకు గురైన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, అంజమ్మ, ప్రశాంత్, నాగమణి, సంతోష, లక్ష్మమ్మలతో పాటు మరికొందరు సోమవారం రాత్రి గ్రామంలో విక్రయించే కల్లు కొనుగోలు చేసి సేవించారు. అయితే మంగళవారం వారు అస్వస్థతకు గురికాగా వారిని వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు రిఫర్ చేయగా,
పట్టణంలోని ఈశ ఆసుపత్రిలో ఒకరు, మెడిక్యూర్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. కల్లులో కలిపిన నీరు కలుషితం కావడం, కల్లులో మందు ఎక్కువ కావడం వల్లే అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మండల పరిధిలో ఈతచెట్లు తక్కువగా ఉండడం, సరిపడా కల్లు రాకపోవడం వల్ల కల్లు మందు ఎక్కువ కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా చిట్టిగిద్దలోని కల్లుడిపో నుండి వచ్చిన కల్తీకల్లు తాగి ఎంతో మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయినా కూడా అధికారులు కల్తీకల్లు తయారు చేస్తున్న డిపోల వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
- Tags
- Illness