cannabis : తనిఖీల్లో 2 కేజీల 105 గ్రాముల గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్..

by Sumithra |
cannabis : తనిఖీల్లో 2 కేజీల 105 గ్రాముల గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్..
X

దిశ, జూబ్లిహిల్స్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన జూబ్లిహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ యూసఫ్ గూడకి చెందిన యశ్ అగర్వాల్ అనే వ్యక్తి ఒరిస్సా నుండి హైదరాబాద్ కి డ్రై గంజాయి ప్యాకెట్లు సరఫరా చేస్తుంటాడు.

అయితే ఆదివారం రాత్రి యూసఫ్ గూడ x రోడ్ వద్ద డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా జూబ్లిహిల్స్ ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ అధికారుల బృందం ఆదివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించగా టీవీఎస్ అపాచీ బైక్ లో యశ్ అగర్వాల్ 2 కేజీల 105 గ్రాముల డ్రై గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద 2 కేజీల 105 గ్రాముల డ్రై గంజాయి, బైక్ స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.

Advertisement

Next Story