- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Possession of marijuana : 115 కిలోల గంజాయి పట్టివేత
దిశ, సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న 115 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ ఎన్ ఫోర్స్ మెంట్ టీం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేయగా రెండు కార్లలో తరలిస్తున్న 115 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఎక్ నాథ్ ఖేసర్, అభినాథ్ బిడెను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 115 కిలోల ఎండు గంజాయితో పాటు రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఎండుగంజాయి విలువ రూ.42 లక్షలు ఉంటుందని ఎక్సై్జ్ అధికారులు తెలిపారు. ఈ వాహనాల తనిఖీలో మెదక్ డివిజన్ సీఐలు బి.గాంధీ నాయక్, పి.వీణారెడ్డి, సీహెచ్.చంద్రశేఖర్, ఎస్ఐలు ఎ.అనిల్ కుమార్, బి.యాదయ్య, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.డి అలీం, ఎం.గోపాల్, అమ్మతుల్ కరీం, మల్కయ్య, రామారావు నాయక్, సతీష్ మోహన్, ఉమారాణి, కావశ్రీ, వివేక్. ప్రహ్లాద్ రెడ్డి పాల్గొన్నారు.