- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Robbers : దారివెంట వెళ్లే వారిని కత్తితో బెదిరించి 10 వేల నగదు దోపిడీ
దిశ, ఖైరతాబాద్ : ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి వెంట వెళ్లే వారిని అర్ధరాత్రి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దోచుకుంటున్న నలుగురు వ్యక్తులను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఎస్ఆర్ నగర్ , ఎస్ఆర్టీలోని విష్ణు బాయ్స్ హాస్టల్ లో ఉండే పవన్ అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి పంజాగుట్టలో సెకండ్ షో సినిమా చూసి తిరిగి హాస్టల్ కు వస్తుండగా ఎస్ఆర్ నగర్,
ఎస్ఆర్టీ వద్ద తరుణ్ , శ్రీను, అద్నాన్ , బబ్లూ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు పోలీస్ ఇన్ఫార్మర్లమంటూ కత్తితో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగింది ఇవ్వలేదంటే గంజా అముతున్నారని, ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నారు అని పోలీసులకు చెప్పి జైలుకు పంపిస్తామని బెదిరించి ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు దోచుకున్నారు. మరుసటి రోజు బాధితులు పోలీసులకు సంచారం అందించగా ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఆధారంగా నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Tags
- Robbers