- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్‌బాస్ హౌస్‌లో టైటిల్ రేస్‌లో నిలిచిన ఓరుగల్లు పోరడి ప్రేయసిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 హోరా హోరీగా సాగుతోంది. ఈ రియాలిటీ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 1 వ తేదీన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్లతో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ లు ఆడిస్తూ తెలుగు ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. పైగా జనాలకు ఈ బిగ్ బాస్ ఫేవరెట్ షోగా నిలిచిపోయింది. ఇకపోతే హౌస్ నుంచి ప్రజెంట్ ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో బేజవాడ బేబక్క, రెండు వారం శేఖర్ బాషా, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారంటూ చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అమ్మాయిలకు దూరంగా ఉంటూ గేమ్ పై ఫోకస్ పెడుతున్న నబీల్ పేరు నెట్టింట మారుమోగుతోంది. బిగ్ బాస్ విన్నర్ ఈయనే అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నబీల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. యూట్యూబ్ వీడియోల్లో తనతో నటించే ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. ఆమె బర్త్ డే రోజు కూడా విషెష్ తెలిపి.. ప్రేమను బయటపెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. తను రెడ్డి కులానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. బిగ్‌బాస్ కప్పు కొట్టి.. బయటికొచ్చాక ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని గట్టి టాక్ వినిపిస్తుంది. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నబీల్, క్యూట్ గా ఉన్న ఆ అమ్మాయి పిక్స్ ప్రెజెంట్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.