బిగ్ బాస్ సీజన్-7లో మొదలవుతున్న ఫ్యామిలీ వీక్.. ఎవరి కోసం ఎవరు వస్తున్నారంటే?

by GSrikanth |
బిగ్ బాస్ సీజన్-7లో మొదలవుతున్న ఫ్యామిలీ వీక్.. ఎవరి కోసం ఎవరు వస్తున్నారంటే?
X

దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్-7 మంచి రసవత్తరంగా సాగుతోంది. ముందు నుంచి ఉల్టా పుల్టా అని చెప్పినట్టుగానే సరికొత్తగా షో నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. కాగా ఈ సారి ఫ్యామిలీ వీక్ కూడా ముందే ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్. ప్రతి సీజన్‌లో సీజన్ ఎండ్ వీక్‌లో ఫ్యామిలీని హౌస్‌లోకి తీసుకొస్తారు. కానీ ఈ ఆదివారం నాటి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారట. అంతేకాదు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు వాళ్లకి సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ కూడా హౌస్‌లోకి పంపబోతున్నారు. కాగా ఏ కంటెస్టెంట్ కోసం ఎవరు వస్తున్నారో తెలుపుకుందాం. ముందుగా శివాజీ కోసం అతని చిన్న కొడుకు రిక్కీతో పాటు అతని భార్య కూడా ఎంటర్ కాబోతున్నారు.

ఇక పల్లవి ప్రశాంత్ కోసం అతని తండ్రి హౌస్‌లో వస్తుండగా.. ప్రశాంత్‌ను సపోర్ట్ చేస్తున్న సోహెల్ స్టేజీ మీదకి రానున్నాడు. అమర్ దీప్ కోసం భార్య తేజస్విని వెళ్లే అవకాశం ఉంది. యావర్ కోసం అతని అన్నయ్య వసీం హౌస్‌లోకి వెళ్లబోతుండగా.. అర్జున్ కోసం అతని భార్య సురేఖ, గౌతమ్ కోసం అతని తల్లి మంగాదేవి రానున్నారు. స్టేజి మీదకి అతని తమ్ముడితో పాటు మరో సెలబ్రిటీ వెళ్తారని సమాచారం. ఇక ప్రియాంక కోసం ఆమె ప్రియుడు శివ వచ్చే అవకాశం ఉందట. మొత్తానికి ఈ వీక్ ఎమోషనల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisement

Next Story