- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: రైతు బిడ్డ ట్యాగ్ లైన్‌తో బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చి ఈ రోజు.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా ఇంటి నుంచి బయటకు వచ్చాడు పల్లవి ప్రశాంత్. ఓ కామెన్ మెన్‌గా బిగ్ బాస్‌లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. దీంతో పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చినప్పుడు.. ప్రశాంత్‌ను చూడటానికి అభిమానులు వందల సంఖ్యలో స్టూడియో వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడక్కడ గొడవలు కూడా జరిగాయి.
అయితే.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులే ఇదంతా చేశారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పల్లవి ప్రశాంత్‌తో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈ రోజు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అయిన ఇద్దరు మరెవరో కాదు.. పల్లవి ప్రశాంత్‌ను రెండో సారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తీసుకొచ్చిన డ్రైవర్లు సాయి కిరణ్, రాజు. ఈ కేసులో వీళ్లిద్దరిని A4, A5గా ఉన్నారు. పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా పల్లవి ప్రశాంత్ ఆదేశాలతో వీరిద్దరూ రోడ్డు మీద కార్లను ఆపారని.. దీంతో అభిమానులు రెచ్చిపోయారని పోలీసులు చెబుతున్నారు. కాగా, రోడ్లపై విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు పోలీసులు.