అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. అక్కడి ముస్లింలు ఏమంటున్నారంటే?

by Jakkula Samataha |
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. అక్కడి ముస్లింలు ఏమంటున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో రామయ్య కొలువు దీరనున్నాడు. జనవరి 22న వేదమంత్రాలు, పండితులు, ప్రముఖులు, కోట్లాది మంది భక్తుల మధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది.ఇప్పటికే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి ముస్లింలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

70 ఎకరాల విస్తీర్ణమున్న రామ మందిర ప్రాంగణం వెనుక కట్రా అనే ప్రాంతం ఉందంట. అక్కడున్న ఓ చిన్న ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు. వారు స్వీట్ బాక్సులు తయారీ చేసి రామ మందిరం ప్రాంగణం చుట్టూ ఉన్న దుకాణాలకు సరఫరా చేస్తారు. అంతే కాకుండా రామ మందిర ప్రారంభోత్సవానికి కావాల్సిన స్వీట్ బాక్సులు కూడా వారే తయారు చేస్తున్నారు. దీని కోసం వారు రాత్రిం భవల్లు కష్టపడుతున్నారు.

అయితే స్వీట్ బాక్సుల వ్యాపారం నిర్వహిస్తున్న ఫూల్ జహాన్‌ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..‌ 31 ఏళ్ల క్రితం జరిగిన అల్లర్లలో తండ్రిని కోల్పోయాను, తనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఓ మూక మా ఇంటిపై దాడి చేసింది, ఆ దాడిలో తన తండ్రిని కోల్పోయినట్లు తెలిపింది. ఇప్పుడు మేము అయోధ్యలో ఎలాంటి సమస్య లేకుండా ఉన్నాం.. చాలా పెద్ద మైలు రాయిని దాటుతున్నాం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని చెప్పుకొచ్చింది.

అలాగే ఫూల్ జహాన్ ఇంటికి యాభై మీటర్ల దూరంలో ఉన్న హఫీజ్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. 31 ఏళ్ల క్రితం అయోధ్యలో జరిగిన అల్లర్లలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ హిందూ కుటుంబం ఇంట్లో ఆశ్రయం పొందానని తెలిపాడు.. అంతే కాకుండా ఆ అల్లర్లలో హఫీజ్ తన సోదరుడిని, బంధువునూ కోల్పోయారు. ఆయన మాట్లాడుతూ, “ఆ ఘటన తర్వాత నుంచి ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది. కానీ, అయోధ్యలో పెద్ద కార్యక్రమం ఉందని, లక్షలాది జనం ఇతర ప్రాంతాల నుంచి వస్తారని తెలిసినప్పుడు మాకు భయం భయంగా ఉంటుంది. అందరూ ప్రశాంతంగానే ఉంటారని మాత్రం ఆశ ఉంది అన్నారు.

Advertisement

Next Story

Most Viewed