- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
22న స్కూళ్లకు సెలవు.. వైన్ షాపులు బంద్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 22ను(సోమవారం) సెలవు దినంగా ప్రకటించాయి. ఆ రోజు అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించాయి. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట రోజున దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర కార్యాలయాలన్నింటికీ హాఫ్ డే లీవ్ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల కన్నా ముందే ఉత్తరప్రదేశ్‌తోపాటు హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా ప్రభుత్వాలు సైతం సోమవారం సెలవు దినంగా ప్రకటించాయి. ఒక్క త్రిపురలో మాత్రం సోమవారం నాడు అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు మధ్యాహ్నం 2:30గంటల తర్వాత తెరుచుకోనున్నాయి. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య జరగనుంది. ఈ రాష్ట్రాల్లో సెలవు ప్రకటించడంతోపాటు ఆ ఒక్కరోజు మద్యం, మాంసం అమ్మకాలపైనా నిషేధం విధించాయి.ఇప్పటివరకు సెలవు ప్రకటించిన రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం.