- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాముడి ‘దర్బార్’ పనులు వెంటనే ప్రారంభిస్తాం : రామాలయం ట్రస్ట్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో మిగిలిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆలయంలోని మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్ సహా రెండో అంతస్తు పనులు వెంటనే ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఆలయం పార్కోట, 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. శనివారం జరిగిన రామమందిర కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించామని నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. అయోధ్య రాముడి దర్శనానికి వస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై తమ ప్రధాన ఫోకస్ ఉంటుందన్నారు.
Advertisement
Next Story