వాళ్ల ఆత్మలంతా ఇప్పుడు శాంతిస్తాయి.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
వాళ్ల ఆత్మలంతా ఇప్పుడు శాంతిస్తాయి.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఆలయ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నో బలిదానాలతో అయోధ్య కలం సాకారమైందని చెప్పారు. ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని అన్నారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. దేశ ప్రజలంతా ఇవాళ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రామ్ లల్లా ఇకపై టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

రాముడు 14 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు వనవాసం చేశాడని అన్నారు. రాముడు ఉన్న చోట హనుమంతుడు కూడా ఉంటాడని చెప్పుకొచ్చారు. 2024 జనవరి 22 కొత్త కాలచక్రానికి ప్రతీక అని కొనియాడారు. ఇది విగ్రహ ప్రతిష్ట కాదని.. భారత దేశ గౌరవం అని అన్నారు. రాముడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారిందని తెలిపారు. 11 రోజుల దీక్ష సందర్భంగా రాముడితో అనుబంధమున్న క్షేత్రాలు సందర్శించినట్లు గుర్తుచేశారు. గర్భగుడిలో ప్రాణప్రతిష్టకు హాజరు కావడం నా అదృష్టం అని మోడీ అభిప్రాయపడ్డారు. అయోధ్య ప్రజలు ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. దశాబ్దాల కల సాకారమైందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed