- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీరాముడికి వినూత్న కానుక.. అయోధ్యకు చేరిన రేగుపండ్లు
దిశ, ఫీచర్స్ : రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. ప్రపంచమంతా ఆ వేడుక చూడటానికి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట విన్నా ఆ రామయ్య పేరే వినిపిస్తుంది. ఇక అయోధ్యలో బాల రాముడు కొలవుదీరనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, అయోధ్యకు తమ వంతుగా విరాళాలు, కానుకలు అందచేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు భక్తులు ఓ వినూత్న కానుక అందజేశారు.వనవాసం సమయంలో శబరి శ్రీ రామునికి ఆకుల్లో ఎంగిలి రేగుపండ్లు తినిపించిదని భక్తులు నమ్ముతారు. అయితే అవే రేగుపండ్లను రాములవారి అమ్మమ్మ ఇళ్లుగా చెప్పుకునే శివ్రినారాయణ ప్రాంతం నుంచి అనూప్ యాదవ్ అనే భక్తుడు రామజన్మభూమి ట్రస్టుకు అందజేసినట్లు తెలిపారు. అలానే శబరి ఏ ఆకులోనైతే ప్రసాదం పెట్టిందో, ఆ మొక్కను కూడా తీసుకొచ్చామని, వాటి ఆకులు గిన్నె ఆకారంలో ఉంటాయని భక్తులు తెలిపారు. అందువలన ఆ మొక్కను గుడి ఆవరణంలో నాటాలని ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లాలోని శివనారాయణ నుండి అయోధ్యకు వెళ్లిన భక్తులు ఆలయ కమిటీని కొరినట్లు సమాచారం.